అప్పుల పరిమితిని ఏపీ ఉల్లంఘించింది

ABN , First Publish Date - 2023-08-02T03:35:37+05:30 IST

నికర అప్పుల పరిమితి(ఎన్‌బీసీ)ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉల్లంఘించిందని కేంద్రం పేర్కొంది.

అప్పుల పరిమితిని ఏపీ ఉల్లంఘించింది

వివిధ సంస్థలు, కార్పొరేషన్ల రుణాలనూ ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తాం: కేంద్రం

న్యూఢిల్లీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): నికర అప్పుల పరిమితి(ఎన్‌బీసీ)ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉల్లంఘించిందని కేంద్రం పేర్కొంది. బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌ (ఎస్‌పీవీ), ఇతర సంస్థల ద్వారా రుణాలు తీసుకున్న విషయం తమ దృష్టికి వచ్చిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధురి తెలిపారు. ఎన్‌బీసీని ఉల్లంఘించి ఇలా తీసుకొచ్చే రుణాలను కూడా.. రాజ్యాంగంలోని 293(3) అధికరణ కింద రాష్ట్రప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామంటూ నిరుడు మార్చిలోనే అన్ని రాష్ట్రాలకూ లేఖ రాశామన్నారు. మంగళవారం రాజ్యసభలో తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2021-22లో రూ.22,366.08 కోట్లు, 2022-23లో రూ.57,449.55 కోట్ల మేరకు గ్యారెంటీలు ఇచ్చినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపిందని వెల్లడించారు.

Updated Date - 2023-08-02T03:35:37+05:30 IST