సంక్షోభంలో ఏపీ ఆర్థిక వ్యవస్థ

ABN , First Publish Date - 2023-01-25T04:01:57+05:30 IST

సీఎం జగన్‌ పరిపాలనలో ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని.. ప్రజలకు ఉచిత పథకాలు అలవాటు చేసి మరింత సోమరిపోతులను చేస్తున్నారని కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి దేవ్‌ సిన్హా చౌహాన్‌ వ్యాఖ్యానించారు.

సంక్షోభంలో ఏపీ ఆర్థిక వ్యవస్థ

కేంద్ర మంత్రి దేవ్‌ సిన్హా చౌహాన్‌

కర్నూలు(న్యూసిటీ), జనవరి 24: సీఎం జగన్‌ పరిపాలనలో ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని.. ప్రజలకు ఉచిత పథకాలు అలవాటు చేసి మరింత సోమరిపోతులను చేస్తున్నారని కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి దేవ్‌ సిన్హా చౌహాన్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం కర్నూలు ప్రభుత్వ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పాలనలో జగన్‌ ఘోరంగా విఫలమయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఫ్రీ ప్రభుత్వంగా మారింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులను.. పేరు మార్చి ఇతర పథకాలకు వాడుకుంటున్నారు. గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన నిధులను కూడా దారిమళ్లించడం దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1న జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటూ రాదు. బీజేపీకే రాష్ట్ర ప్రజల మద్దతు ఉంది. కేంద్రం లక్షలలో ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చినా... ఈ ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేయలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అభివృద్ధి కోసం ఇస్తున్న నిధులను రాష్ట్రం వాడుకోవడం లేదు. వలంటీర ్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఆయుష్మాన్‌ కార్డు ఇవ్వకుండా పేరు మార్చి ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నారు. ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో 1000 కి.మి. అభివృద్ది చేయాలని చూస్తుంటే ఈ ప్రభుత్వం భూములు కూడా ఇవ్వడం లేదు’ అని ధ్వజమెత్తారు. రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ ఎన్నికల కోసమే బీజేపీ, జనసేన పొత్తులు ఉంటాయన్నారు.

Updated Date - 2023-01-25T04:01:57+05:30 IST