MargadarshI ​​MD Shailaja: మార్గదర్శి ఎండీ శైలజను విచారించిన ఏపీ సీఐడీ

ABN , First Publish Date - 2023-06-07T03:02:50+05:30 IST

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేసులో ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్‌ను ఏపీ సీఐడీ పోలీస్‌లు విచారించారు.

 MargadarshI ​​MD Shailaja: మార్గదర్శి ఎండీ శైలజను  విచారించిన ఏపీ సీఐడీ

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేసులో ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్‌ను ఏపీ సీఐడీ పోలీస్‌లు విచారించారు. డిపాజిట్ల సేకరణ, నిధుల మళ్లింపు, ఐటీ చట్టం ఉల్లంఘన తదితర అంశాలపై ఏపీ సీఐడీ మార్గదర్శిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం ఉదయమే జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న అధికారుల బృందం సాయంత్రం వరకు విచారణ కొనసాగించింది. స్టేట్‌మెంట్‌ రికార్డు, పంచనామా అనంతరం వెనుదిరిగింది. మార్గదర్శి కేసులో ఇప్పటికే ఆ సంస్థ ఉద్యోగుల్ని సీఐడీ పోలీస్‌లు అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2023-06-07T03:02:50+05:30 IST