ఒడిశా ప్రమాదంపై సమాధానం చెప్పాలి: రామకృష్ణ
ABN , First Publish Date - 2023-06-07T04:14:02+05:30 IST
ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనకు సంబంధించి సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు చేసిన ప్రకటనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.
గుంటూరు(తూర్పు), జూన్ 6: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనకు సంబంధించి సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు చేసిన ప్రకటనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం గుంటూరులో మాట్లాడుతూ తమ వైఫల్యం, అసమర్ధతలను కప్పిపుచ్చుకోనేందుకు కేంద్రం కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. ప్రమాదానికి మైనార్టీలే కారణమంటూ వారిని లక్ష్యంగా చేసుకుని సంఘ్ పరివార్, ఆర్‌ఎ్‌సఎస్ శక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. రైలు ప్రమాదం ఎలా జరిగింది.. కారణాలేంటి.. సాంకేతిక లోపమా.. మానవ తప్పిదమా అనే అంశాలపై దర్యాప్తు చేయకుండా సీబీఐ దర్యాప్తు పేరుతో సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. పోలవరంపై సీఎం జగన స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో లాలూచీ పడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దని సూచించారు. సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి పోలవరం పరిసర ప్రాంతాలలో పాదయాత్ర చేపట్టనున్నామని రామకృష్ణ తెలిపారు.