మరో 3 రోజులు వడగాడ్పులు

ABN , First Publish Date - 2023-06-01T04:53:40+05:30 IST

రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు పెరుగుతాయని విపత్తుల స్పందనా సంస్థ తెలిపింది. గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని

మరో 3 రోజులు వడగాడ్పులు

పలు చోట్ల పిడుగులు పడే అవకాశం

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు పెరుగుతాయని విపత్తుల స్పందనా సంస్థ తెలిపింది. గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని, ఎండ ప్రభావం చూపుతుందని పేర్కొంది. శుక్రవారం 302 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చూపుతాయని హెచ్చరించింది. అకాల వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, బుధవారం మంత్రాలయంలో 43.4, మర్రిపూడిలో 43.1, కామవరపుకోటలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - 2023-06-01T04:53:40+05:30 IST