రేపు అన్నవరపు రామస్వామికి నాద విద్యాభారతి పురస్కారం

ABN , First Publish Date - 2023-09-01T04:49:38+05:30 IST

విశాఖ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ 37వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరుకు చెందిన ప్రముఖ వయోలిన్‌ విద్వాంసుడు పద్మశ్రీ డాక్టర్‌ అన్నవరపు...

రేపు అన్నవరపు రామస్వామికి నాద విద్యాభారతి పురస్కారం

మద్దిలపాలెం (విశాఖపట్నం), ఆగస్టు 31: విశాఖ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ 37వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరుకు చెందిన ప్రముఖ వయోలిన్‌ విద్వాంసుడు పద్మశ్రీ డాక్టర్‌ అన్నవరపు రామస్వామికి నాద విద్యాభారతి పురస్కారం ప్రదానం చేయనున్నట్టు ఆ సంస్థ అధ్యక్షుడు మంతెన సత్యనారాయణరాజు, కార్యదర్శి రాంబాబు విలేకరులకు తెలిపారు. కళాభారతి ఆడిటోరియంలో శనివారం జరిగే జాతీయ సంగీత నాటకోత్సవాల్లో రామస్వామికి ఈ పురస్కారం అందజేస్తామని చెప్పారు. రూ.లక్ష నగదు, రూ. 2 లక్షల విలువ చేసే స్వర్ణకంకణం, ప్రశంసాపత్రం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరుకానున్నట్టు తెలిపారు.

Updated Date - 2023-09-01T04:49:48+05:30 IST