మట్టి దోపిడీ

ABN , First Publish Date - 2023-03-18T00:49:07+05:30 IST

మండల పరిధిలోని జయమంగళి నదీపరివాహక ప్రాంతంలో యథేచ్ఛగా మట్టి దోపిడీ సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి అక్రమ రవాణా సాగుతోంది. ఎక్సాకవేటర్లతో విచ్చలవిడిగా తవ్వేస్తూ వందలాది ట్రాక్టర్ల మట్టి తరలుతోంది.

మట్టి దోపిడీ

జయమంగళి నరి పరివాహక ప్రాంతం గుల్ల

విచ్చలవిడిగా ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా

పరిగి, మార్చి 17: మండల పరిధిలోని జయమంగళి నదీపరివాహక ప్రాంతంలో యథేచ్ఛగా మట్టి దోపిడీ సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి అక్రమ రవాణా సాగుతోంది. ఎక్సాకవేటర్లతో విచ్చలవిడిగా తవ్వేస్తూ వందలాది ట్రాక్టర్ల మట్టి తరలుతోంది. ఇటుక బట్టీల యజమానులు సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు న్నాయి. రోజూ వందలాది ట్రాక్టర్ల లోడు మట్టిని రవాణా చేస్తున్నారు. ఇటుక బట్టీల కోసం మట్టిని సరఫరా చేస్తున్నా, వీరిని ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతిలేకుండా వందలాది ట్రాక్టర్లు మట్టిని అక్రమ రవాణా చేస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. రైతులు పంట పొలానికి కొంత మట్టిని తరలిస్తే నిబంధనల పేరుతో ట్రాక్టర్లను సీజ్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు అనుమతులు లేకుండా మట్టిని తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2023-03-18T00:49:07+05:30 IST