Share News

అమరావతి అజరామరమై నిలుస్తుంది: లోకేశ్‌

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:03 AM

రైతుల త్యాగాల పునాదులపై వెలిసిన ప్రజారాజధాని అమరావతి అజరామరమై నిలుస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ స్పష్టం చేశారు. ఆదివారం ఎక్స్‌లో ఆయన స్పందిస్తూ...

అమరావతి అజరామరమై నిలుస్తుంది: లోకేశ్‌

అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రైతుల త్యాగాల పునాదులపై వెలిసిన ప్రజారాజధాని అమరావతి అజరామరమై నిలుస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ స్పష్టం చేశారు. ఆదివారం ఎక్స్‌లో ఆయన స్పందిస్తూ... ‘మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న సైకో జగన్‌ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లయ్యింది. భూములిచ్చిన రైతుల్ని హింసపెట్టారు. రోడ్లు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయించాడు. ఇన్నిచేసినా అమరావతిని ఇంచ్‌ కూడా కదపలేకపోయాడు. సైకో జగన్‌ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుంది. అమరావతి అజరామరమై నిలుస్తుంది’ అని లోకేశ్‌ అన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 03:03 AM