కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలి

ABN , First Publish Date - 2023-06-07T04:17:13+05:30 IST

తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్‌ చేయాలని ఏపీ గవర్నమెంట్‌ కాలేజెస్‌ కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది.

కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలి

ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్ట్‌ ఉద్యోగుల డిమాండ్‌

అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్‌ చేయాలని ఏపీ గవర్నమెంట్‌ కాలేజెస్‌ కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. 2014 జూన్‌ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసును మాత్రమే రెగ్యులర్‌ చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం సుముఖత తెలపడం దారుణమని అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేష్‌, కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలన్నారు.

Updated Date - 2023-06-07T04:17:13+05:30 IST