Share News

మద్యనిషేధం అమలు చేయాల్సిందే

ABN , Publish Date - Dec 24 , 2023 | 03:04 AM

మద్య నిషేధం హామీని అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఏపీ మహిళా సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్‌) ప్రతినిధులు శనివారం

మద్యనిషేధం అమలు చేయాల్సిందే

యుజవన, మహిళా సమాఖ్యల ఆందోళన

విశాఖపట్నం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మద్య నిషేధం హామీని అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఏపీ మహిళా సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్‌) ప్రతినిధులు శనివారం రహదారిపై మద్యం పారబోసి వినూ త్న రీతిలో ఆందోళన చేపట్టారు. విశాఖ నగరంలోని చావులమదుం సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద చేపట్టి న కార్యక్రమంలో ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎంఏ బేగం, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా కార్యదర్శి వై.రాంబాబు మాట్లాడుతూ... అధికారంలోకి వస్తే మద్యనిషేధం అమలు చేస్తానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారని తెలిపారు. పదవిలోకి వచ్చి నాలుగున్నరేళ్లు దాటిపోయినా హామీని అమలు చేయడం లేద ని మండిపడ్డారు. అనంతరం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యాన్ని రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కె.వనజాక్షి, ఉపాధ్యక్షురాలు పుష్పలత, ఏఐఎ్‌సఎఫ్‌ నేత నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 03:04 AM