Adani : ఇప్పుడేం చేస్తారో?!

ABN , First Publish Date - 2023-02-05T03:03:58+05:30 IST

దేశం యావత్తూ అదానీ షేర్ల పతనంపై శివాలెత్తిపోతుంది. పార్లమెంటు ఉభయసభలూ చర్చలు లేకుండానే వాయిదా పడుతున్నాయి. అదానీ పేరెత్తితేనే ప్రతివారిలో కంపరం మొదలవుతోంది.

Adani : ఇప్పుడేం చేస్తారో?!

అదానీకి అడిగిందే తడవుగా అన్నీ అప్పగింత

నిపుణులు, విపక్షాలు హెచ్చరిస్తున్నా భారీ సంతర్పణ

కారుచౌకగా భూములు, సోలార్‌ప్లాంట్లు, రిజర్వాయర్లు

ఇప్పుడు ఈ ప్రాజెక్టులకు బ్యాంకుల రుణం కష్టమే

పంప్డ్‌ స్టోరేజీలో సీఈఏ మార్గదర్శకాల మాటేమిటి?

అమరావతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): దేశం యావత్తూ అదానీ షేర్ల పతనంపై శివాలెత్తిపోతుంది. పార్లమెంటు ఉభయసభలూ చర్చలు లేకుండానే వాయిదా పడుతున్నాయి. అదానీ పేరెత్తితేనే ప్రతివారిలో కంపరం మొదలవుతోంది. మరోవైపు...అదానీకి ‘అప్పగింత’లకు జగన్‌ ప్రభుత్వం తొందరపడుతోంది. కోరిందే తడవుగా అన్నీ సమర్పిస్తోంది. దేశానిది ఒక దారి అయితే, ఏపీది ఎవరికీ అంతుబట్టని రివర్స్‌ ‘దారి’ అనేది ఇంకోసారి రుజువు చేస్తోం ది. ప్రస్తుతం అదానీ సంస్థలు రోజురోజుకూ కుదేలవుతున్న తరుణంలో, జగన్‌ ప్రభుత్వం కేటాయించిన ప్రాజెక్టులకు బ్యాం కుల నుంచి అప్పులు పుట్టడం కష్టమే. ఈ తరుణంలో పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్లు స్థాపించడం అదానీకి సాధ్యమేనా అనే సందేహాలు నెలకొన్నాయి. ప్రతిష్ఠకు పోకుండా ఈ ప్లాంట్ల స్థాపన బాధ్యతను ఏపీ జెన్కోకు అప్పగించాలని రాష్ట్ర విద్యుత్తురంగ నిపుణులు ప్రభుత్వానికి ఘాటుగా సూచిస్తున్నాయి. నిజానికి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డికి అత్యంత సన్నిహితుడైన అదానీకి రాష్ట్రాన్ని కట్టబెట్టడమే పనిగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోంది. ఈ క్రమంలో పోర్టులు, సోలార్‌ ప్లాం ట్లు, పంప్డ్‌ స్టోరేజీ ప్లాంటు.. ఇలా ఏదీ వదిలిపెట్టకుండా అదానీకి కారుచౌకగా రాసిచ్చేస్తోంది. అదానీ కంపెనీలు సంక్షోభం సుడిలో కూరుకుపోయిన ఈ దశలోనూ తన నిర్ణయాలపై పునరాలోచన చేయడం లేదు. పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్రాజెక్టుల కోసం అదానీకి ఏకంగా 1070 ఎకరాలనూ .. రిజర్వాయర్లనూ ప్రభు త్వం అప్పగించేసింది.

పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్లను అదానీకి కట్టబెట్టడమే కాకుండా..అస్మదీయ కంపెనీలు ఆస్తా గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌, అరబిందో రియాలిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఇండోసోల్‌ కంపెనీలకు కూడా అప్పగించేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేబినెట్‌ ఆమోదం లభించిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అత్యంత కారుచౌకగా విద్యుత్తు లభించే పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్లను రాష్ట్ర విద్యుత్తు ఉత్పత్తి సంస్థకు (ఏపీజెన్కో) ప్రభుత్వం ఎందుకు అప్పగించలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కృష్ణపట్నం థర్మల్‌ విద్యు త్తు ప్లాంటు ఉత్పత్తివ్యయం భారీగా ఉందంటూ ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించేందుకు సిద్ధపడి కేబినెట్‌ ఆమోదం తీసుకున్న జగన్‌ సర్కారు...దీర్ఘకాలం అతిచౌకగా చేతికి వచ్చే పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్లను మాత్రం .. అత్యంత సన్నిహిత, అస్మదీయులకు అప్పగించేసేందుకు ఎందుకు తొందరపడుతోందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

కేంద్రం ఏం చెబుతోంది?

పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలంటే పారదర్శకంగా టెండర్లను పిలవాలని కేంద్రం మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఇంకా... పర్యావరణ, అటవీ అనుమతులతోపాటు .. కేంద్ర విద్యుత్తు సంస్థ (సీఈఏ) అనుమతులు తప్పనిసరిగా కావాలి. సీఈఏ ఆమోదముద్ర పడకుండా..పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్ల నిర్మాణానికి ముందుకు వెళ్లేందుకు ఆస్కారమేలేదు. కనీసం ప్లాం టు ప్రహారీ నిర్మాణాన్ని కూడా చేపట్టేందుకు వీల్లేదు. పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్రాజెక్టులను ఎలాపడితే అలా రాష్ట్రాలకు కేటాయించడం కుదరదు. ఈ ప్లాంట్ల ఏర్పాటు వల్ల .. పర్యావరణానికి విఘాతం కలగడమే కాకుండా .. ఆ ప్రాంతంలో నివసించే గిరిజనుల జీవన ప్రమాణాలు పూర్తి ప్రమాదంలో పడే వీలుంది. అందువల్ల .. పూర్తి పారదర్శకతను పాటిస్తూ .. టెండరును పిలవాల్సి ఉం టుంది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రివర్స్‌ టెండరింగ్‌కూ వెళ్లాలని కేంద్రం మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే, ఇందుకు భిన్నంగా ఇవేవీ పాటించకుండానే .. అనుకున్నదే తడవుగా అదానీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించేసింది. ఇందుకోసం .. రాష్ట్రంలోని అత్యంత విలువైన .. రిజర్వాయర్లు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది.

గత ఏడాది అక్టోబరులో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో ఇంధన శాఖ వెల్లడించిన సమాచారం మేరకు .. కడప జిల్లా గండికోట రిజర్వాయరులో 1000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంటు కోసం అదానీకి 470 ఎకరాలు కట్టబెట్టారు. అదేవిధంగా శ్రీసత్యసాయి జిల్లాలో చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంటు కోసం 390 ఎకరాలు, పార్వతీపురం మన్యం జిల్లాల కురుకుర్తి రిజర్వాయరు వద్ద 1200 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంటు కోసం 362మొ ఎకరాలు, పార్వతీపురం మన్యం జిల్లా కర్రివలస రిజర్వాయరులో 1000 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి కోసం 318 ఎకరాలను అదానీకి ప్రభుత్వం కేటాయించింది. ఇలా .. మొత్తంగా 1070 ఎకరాలను పంప్డ్‌ స్టోరేజీ హైడల్‌ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం కేటాయించింది.

Updated Date - 2023-02-05T03:03:59+05:30 IST