ప్రగతి చక్రం.. ఊడిపోయింది!

ABN , First Publish Date - 2023-06-02T04:29:37+05:30 IST

అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లాగరాయి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది.

ప్రగతి చక్రం.. ఊడిపోయింది!

– రాజవొమ్మంగి : అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లాగరాయి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. బస్సు వెళుతుండగానే టైరు ఊడిపోయింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం జరగలేదు. ప్రమాదసమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. బోల్టు విరిగిపోవడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అధ్వాన్న రోడ్ల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు.

Updated Date - 2023-06-02T04:29:37+05:30 IST