ఒక్క డీఎస్సీ నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-08-22T03:36:24+05:30 IST

జగన్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేని అసమర్థ, చేతగాని ప్రభుత్వం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది.

ఒక్క డీఎస్సీ నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం

రాజకీయ స్వార్థానికి వలంటీర్ల భవిష్యత్‌ నాశనం: రామచంద్రయాదవ్‌

విజయవాడ(ధర్నాచౌక్‌), ఆగస్టు 21: ‘‘జగన్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేని అసమర్థ, చేతగాని ప్రభుత్వం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన బాధ్యతను బీసీవై పార్టీ భుజాన వేసుకుంది. దీనిలో భాగంగా మొదటి దశలో సుమారు 500 కంపెనీల్లో 50 వేలకు పైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సెప్టెంబరు 2, 3 తేదీల్లో మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నాం’’ అని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) అధినేత రామచంద్ర యాదవ్‌ తెలిపారు. గాంధీ నగర్‌లోని ఓ హోటల్‌లో కార్యక్రమ వాల్‌ పోస్టర్‌ను ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాదవ్‌ మాట్లాడారు. జగన్‌ తన రాజకీయ స్వార్ధానికి రెండు లక్షల 50 వేల మంది వలంటీర్ల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2023-08-22T03:36:24+05:30 IST