గుండెపోటుతో తొమ్మిదేళ్ల బాలిక మృతి

ABN , First Publish Date - 2023-03-25T03:05:20+05:30 IST

గుండెపోటుతో తొమ్మిదేళ్ల పాప కన్నుమూసింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన తోట శ్రీను, రాధ దంపతుల కుమార్తె పవిత్ర(9) జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది.

గుండెపోటుతో తొమ్మిదేళ్ల బాలిక మృతి

జంగారెడ్డిగూడెం, మార్చి 24: గుండెపోటుతో తొమ్మిదేళ్ల పాప కన్నుమూసింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన తోట శ్రీను, రాధ దంపతుల కుమార్తె పవిత్ర(9) జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. ఈ బాలికకు గతంలో గుండెపోటు రావడంతో హైదరాబాద్‌, రాజమండ్రి ఆస్పత్రుల్లో వైద్యం అందించారు. శుక్రవారం మరోసారి పవిత్రకు గుండెనొప్పి వచ్చి ఇంటి వద్దనే మృతి చెందిందని బంధువులు తెలిపారు.

Updated Date - 2023-03-25T03:05:20+05:30 IST