CPI leader Narayana : జగన్‌.. మోదీని మించిన ఘనుడు!

ABN , First Publish Date - 2023-05-02T03:16:14+05:30 IST

: సీఎం జగన్‌.. ప్రధాని మోదీని మించిన ఘనుడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. మేడే సందర్భంగా సోమవారం నెల్లూరులో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

CPI leader Narayana : జగన్‌.. మోదీని మించిన ఘనుడు!

హోదా, హామీలు కేంద్రానికి తాకట్టు: సీపీఐ నేత నారాయణ

నెల్లూరు(వైద్యం), మే 1: సీఎం జగన్‌.. ప్రధాని మోదీని మించిన ఘనుడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. మేడే సందర్భంగా సోమవారం నెల్లూరులో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ‘ప్రజావ్యతిరేక నిరంకుశ మతోన్మాద బీజేపీని సాగనంపుదాం’ అన్న అంశంపై నారాయణ మాట్లాడారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాను జగన్‌ కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కేంద్రం నిర్ణయాలకు తలాడిస్తున్నారని ఆరోపించారు. రూ.3 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కును నిర్వీర్యం చేస్తున్న కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా ఉన్నారని అన్నారు. ఆగా, బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు వెల్లడించారు.

Updated Date - 2023-05-02T03:16:14+05:30 IST