Share News

ఎనిమిది నెలల్లో 90 వేల కోట్ల అప్పు

ABN , First Publish Date - 2023-11-29T04:07:31+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కొత్తగా మరో రూ.1000 కోట్ల అప్పు తెచ్చింది. ఈ అప్పును 12ఏళ్ల కాలపరిమితితో 7.7 శాతం వడ్డీకి తీసుకొచ్చారు.

ఎనిమిది నెలల్లో 90 వేల కోట్ల అప్పు

కొత్తగా మరో రూ.1000 కోట్ల రుణం

కాగ్‌కు వివరాలు ఇవ్వకుండా దాటవేత

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కొత్తగా మరో రూ.1000 కోట్ల అప్పు తెచ్చింది. ఈ అప్పును 12ఏళ్ల కాలపరిమితితో 7.7 శాతం వడ్డీకి తీసుకొచ్చారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు చేసిన రుణాలు రూ.90,000కోట్లు దాటాయి. అయితే కాగ్‌ నివేదికలో మాత్రం ఈ అప్పుల వివరాలు పూర్తిస్థాయిలో కనిపించడం లేదు. నాలుగున్నరేళ్ల నుంచీ ప్రభుత్వం అప్పులను దాచిపెడుతోంది. కాగ్‌కి కూడా అరకొరగానే వివరాలు అందిస్తోంది. ముఖ్యంగా కార్పొరేషన్‌ రుణాల గురించి సమాచారం ఇవ్వడం లేదు. ఈ వివరాలు తమకు చెప్పాలంటూ కాగ్‌ ప్రతినెలా అడుగుతున్నప్పటికీ జగన్‌ సర్కారు పట్టించుకోవడం లేదు. కాగ్‌ నివేదిక ప్రకారం అక్టోబరు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.59,720 కోట్ల అప్పులు తెచ్చింది. కానీ, అవి ఇంతకంటే ఎక్కువే ఉంటాయి. కార్పొరేషన్‌ అప్పులు రూ.25,000కోట్లు దాటాయి. నవంబరులో రూ.2,000కోట్లు ఆర్‌బీఐ నుంచి తెచ్చారు. ప్రభుత్వం ఈ 8నెలలకు అధికారికంగా చూపిస్తున్న అప్పుల లెక్క రూ.86,720 కోట్లుగా ఉంది. దాచిన అప్పులన్నీ కలిపితే ఈ మొత్తం రూ.90,000 కోట్లు దాటిపోతుంది.

Updated Date - 2023-11-29T04:07:32+05:30 IST