మరో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు

ABN , First Publish Date - 2023-06-02T04:48:07+05:30 IST

రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభిస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని

మరో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు

● విజయనగరం, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం, రాజమండ్రిల్లో ప్రారంభం

● మెడికల్‌ పీజీ సీట్లు 1,388కి పెంపు: ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని

గుంటూరు(మెడికల్‌), జూన్‌ 1: రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభిస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని తెలిపారు. గురువారం ఆమె గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 16కు చేరుతుందన్నారు. కొత్తగా విజయనగరం, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం, రాజమండ్రిలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఒక్కో కాలేజీలో 150 చొప్పున కొత్తగా 750 ఎంబీబీఎస్‌ సీట్లు ఈ ఏడాది అదనంగా అందుబాట్లోకి వస్తాయని వివరించారు. వీటికి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) అన్ని అనుమతులు మంజూరు చేసిందన్నారు. ఆగస్టులో అడ్మిషన్లు పూర్తిచేసి సెప్టెంబరు నుంచి క్లాసులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రాజమండ్రి మెడికల్‌ కళాశాలకు ఎన్‌ఎంసీ నుంచి గురువారం అనుమతి లభించినట్లు తెలిపారు. ఎంబీబీఎస్‌తో పాటు మెడికల్‌ పీజీ సీట్లను కూడా 1,388కి పెంచినట్లు మంత్రి తెలిపారు.


Updated Date - 2023-06-02T04:48:07+05:30 IST