ఇన్ఫోసి్‌సలో ఉద్యోగాలకు 4089మంది ఆదిత్య విద్యార్థుల ఎంపిక
ABN , First Publish Date - 2023-03-19T02:44:40+05:30 IST
ఇన్ఫోసి్‌సలోని బీపీఎం ఉద్యోగాలకు ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు 4089మంది ఎంపికైనట్టు ఆదిత్య కార్యదర్శి ఎన్.కృష్ణదీపక్‌రెడ్డి తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.2.20లక్షల జీతంతోపాటూ ఇతర అలవెన్సులు ఇస్తారన్నారు.

కాకినాడ రూరల్, మార్చి 18: ఇన్ఫోసి్‌సలోని బీపీఎం ఉద్యోగాలకు ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు 4089మంది ఎంపికైనట్టు ఆదిత్య కార్యదర్శి ఎన్.కృష్ణదీపక్‌రెడ్డి తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.2.20లక్షల జీతంతోపాటూ ఇతర అలవెన్సులు ఇస్తారన్నారు. శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి వరకు ఉన్న తమ బ్రాంచ్‌ల్లో రెండునెలలపాటు జరిగిన ఇంటర్వ్యూల్లో ఈ ఎంపికలు జరిగాయని, ఇంటర్వ్యూలు కొనసాగుతాయన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను చైర్మన్ శేషారెడ్డి, డైరెక్టర్ సుగుణారెడ్డి, సమన్వయకర్త బీఈవీఎల్ నాయుడు అభినందించారు.