Share News

19న వ్యవసాయ కళాశాలలో క్రీడాపోటీలు

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:42 PM

మహానంది సమీపంలోని ఆచార్య ఎన్‌ జీరంగా వ్యవసాయ కళాశాలలో ఈనెల 19 న థర్డ్‌ఫేస్‌ ఇంటర్‌ కాలేజ్‌ గేట్‌ 2023-24 క్రీడా పోటీలు ప్రారంభిస్తున్నట్లు కళాశాల అసోసీయేట్‌ డీన్‌ కె ఎస్‌ఎస్‌ నాయక్‌ ఆదివారం తెలిపారు.

19న  వ్యవసాయ కళాశాలలో  క్రీడాపోటీలు

మహానంది, డిసెంబరు 17: మహానంది సమీపంలోని ఆచార్య ఎన్‌ జీరంగా వ్యవసాయ కళాశాలలో ఈనెల 19 న థర్డ్‌ఫేస్‌ ఇంటర్‌ కాలేజ్‌ గేట్‌ 2023-24 క్రీడా పోటీలు ప్రారంభిస్తున్నట్లు కళాశాల అసోసీయేట్‌ డీన్‌ కె ఎస్‌ఎస్‌ నాయక్‌ ఆదివారం తెలిపారు. 19న ఉదయం 9 గంటలకు వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ శారదా జయలక్ష్మిదేవి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. వీరితో పాటు యూనివర్షిటీ డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ ఎఫైర్స్‌ పి. సాంబశివరావు, మహానంది దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి, యూనివర్షిటి డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ జి. కరుణాసాగర్‌, నంద్యాల ఆర్‌ఏఆర్‌ ఎస్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ ఎన్‌సీ వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథులుగా హాజరవుతున్నట్లు కళాశాల డీన్‌ తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే క్రీడా పోటీలకు రాష్ట్రంలోని వ్యవసాయ కళాశాలల విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు.

Updated Date - Dec 17 , 2023 | 11:42 PM