Share News

ఒకేరోజు 1.22 లక్షల కేసుల పరిష్కారం: డీజీపీ

ABN , First Publish Date - 2023-12-11T02:44:42+05:30 IST

చిన్న చిన్న వివాదాలు.. అతి చిన్న నష్టాలు.. సాధారణ సమస్యలతో పోలీసుస్టేషన్లలో ఫిర్యాదుచేసి కోర్టుల చుట్టూ తిరుగుతోన్న 1.22 లక్షల మందికి ఒకే రోజు

ఒకేరోజు 1.22 లక్షల కేసుల పరిష్కారం: డీజీపీ

కక్షిదారులకు ప్రశంస, పోలీసులకు అభినందన

అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): చిన్న చిన్న వివాదాలు.. అతి చిన్న నష్టాలు.. సాధారణ సమస్యలతో పోలీసుస్టేషన్లలో ఫిర్యాదుచేసి కోర్టుల చుట్టూ తిరుగుతోన్న 1.22 లక్షల మందికి ఒకే రోజు ఉపశమనం లభించడం సంతోషకరమని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌లలో వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ ద్వారా పరిష్కారం అయ్యేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటూ అన్ని జిల్లాల ఎస్పీలను కొన్ని రోజుల క్రితమే డీజీపీ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 386 ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేసి పరిష్కారానికి మార్గం చూపడంతో పోలీసు శాఖకు చెందిన 1,22,146 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో ఐపీసీ పరిధిలోకి వచ్చే 19,150 కేసులు, పోలీసు దర్యాప్తులో ఉన్న 7,970 కేసులు, విచారణ పెండింగ్‌లో ఉన్న 11,180 కేసులు, ఐపీసీ పరిధిలోకి రాని 1.03 లక్షల కేసులు ఉన్నట్టు డీజీపీ తెలిపారు. కేసులు అత్యధికంగా పరిష్కరించుకున్న విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ను డీజీపీ అభినందించారు.

Updated Date - 2023-12-11T02:44:43+05:30 IST