సాబుదానా థాలీ పీట్‌

ABN , First Publish Date - 2022-09-27T19:19:21+05:30 IST

సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. బంగాళదుంపలను ఉడికించి, పొట్టుతీసి గుజ్జుగా చేసుకోవాలి. పల్లీలను వేయించి పొడి చేసుకోవాలి.

సాబుదానా థాలీ పీట్‌

కావలసినవి:

సగ్గుబియ్యం - ఒకటిన్నర కప్పు, బంగాళదుంపలు - రెండు, జీలకర్ర - అర టీస్పూన్‌, పల్లీలు - నాలుగు టేబుల్‌స్పూన్లు, అల్లం - చిన్నముక్క, కొత్తిమీర - ఒక కట్ట, నిమ్మరసం - ఒకటీస్పూన్‌, పంచదార - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - తగినంత. 


తయారీ విధానం:

సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. 

బంగాళదుంపలను ఉడికించి, పొట్టుతీసి గుజ్జుగా చేసుకోవాలి.

పల్లీలను వేయించి పొడి చేసుకోవాలి. 

ఉదయాన్నే సగ్గుబియ్యంలో నీళ్లన్నీ తీసివేసి బంగాళదుంపల గుజ్జు వేసి కలుపుకోవాలి. 

జీలకర్ర, పల్లీల పొడి, అల్లం, కొత్తిమీర, పంచదార, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి మరోసారి కలుపుకోవాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి ఒక చెంచా నూనె వేసి పాన్‌పై సమంగా అంటేలా రాయాలి. 

అర చేతులకు కొద్దిగా నూనె రాసుకుని మిశ్రమాన్ని కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ థాలీ పీట్‌లు ఒత్తుకోవాలి.

వీటిని పాన్‌పై వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.  

పాన్‌ పెద్దగా ఉంటే ఒకేసారి రెండు మూడు థాలీ పీట్‌లు వేసి కాల్చుకోవచ్చు. 

చట్నీ లేదా టొమాటో కెచప్‌తో సర్వ్‌ చేసుకుంటే ఇవి చాలా రుచిగా ఉంటాయి.

Read more