స్టఫ్డ్‌ దోశ

ABN , First Publish Date - 2022-02-16T19:08:56+05:30 IST

రవ్వ- కప్పు, మందపాటి అటుకులు- కప్పు, వరి పిండి- రెండు స్పూన్లు, పెరుగు- అర కప్పు, క్యారెట్‌ ముక్కలు- కప్పు, ఉల్లి- అర కప్పు, బంగాళా దుంపలు- మూడు, క్యాప్సికమ్‌ ముక్కలు - అర కప్పు, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, బేబీ కార్న్‌, పచ్చి బఠానీ

స్టఫ్డ్‌ దోశ

కావలసిన పదార్థాలు: రవ్వ- కప్పు, మందపాటి అటుకులు- కప్పు, వరి పిండి- రెండు స్పూన్లు, పెరుగు- అర కప్పు, క్యారెట్‌ ముక్కలు- కప్పు, ఉల్లి- అర కప్పు, బంగాళా దుంపలు- మూడు, క్యాప్సికమ్‌ ముక్కలు - అర కప్పు, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, బేబీ కార్న్‌, పచ్చి బఠానీ- అర కప్పు, పసుపు- అర స్పూను, అల్లం ముక్కలు - అర స్పూను, పోపు గింజలు- స్పూను, నూనె, నీళ్లు, ఉప్పు- తగినంత, నిమ్మరసం- అర స్పూను.


తయారుచేసే విధానం: ముందుగా బంగళాదుంపని ఉడికించి మెత్తగా చేసుకోవాలి. పెద్ద పాన్‌లో నూనె వేసి పోపు గింజలు చిటపటలాడించాలి. ఆ తరవాత ఉల్లి ముక్కలు రంగు మారే వరకు వేయించాలి. పసుపు, ఉప్పు, క్యారెట్‌, స్వీట్‌ కార్న్‌, పచ్చి బఠానీ, అల్లం వేసి ఓ నిమిషం పాటు వేగించాలి. ఇందులో బంగాళాదుంపనూ జతచేయాలి. కొత్తి మీర తరుగు, నిమ్మరసం కలిపి స్టవ్‌ను కట్టేయాలి. రవ్వ, అటుకుల్ని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. దీంట్లోనే వరి పిండి, పెరుగు, కాస్త నీళ్లను కలిపి పావుగంట పక్కన పెట్టాలి. చిన్న పాన్‌ తీసుకుని కాస్త నూనె పూసి దోశపిండిని వేయాలి. ఆలూ మిశ్రమాన్ని దీని మధ్యలో వేసి గరిటతో కాస్త వత్తాలి. పైన మళ్లీ దోశపిండి వేసి మూత పెట్టాలి. రెండు నిమిషాల తరవాత మూతతీసి ఇరువైపులా కాలిస్తే స్టఫ్డ్‌ దోశ రెడీ.

Updated Date - 2022-02-16T19:08:56+05:30 IST