సోయా పాన్‌కేక్స్
ABN , First Publish Date - 2022-05-21T18:56:51+05:30 IST
సోయా పిండి - 150గ్రాములు, ఓట్స్ - 200గ్రాములు, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒకకట్ట,

కావలసినవి: సోయా పిండి - 150గ్రాములు, ఓట్స్ - 200గ్రాములు, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒకకట్ట, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్, ఉప్పు - తగినంత.
తయారీ విధానం: ఓట్స్‌ని అరగంట పాటు నానబెట్టు కోవాలి.తరువాత ఓట్స్‌ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో సోయాపిండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కలుపుకోవాలి. మిశ్రమం బాగా చిక్కగా ఉండకుండా చూసుకోవాలి.స్టవ్‌పై నాన్‌స్టిక్ పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి మిశ్రమాన్ని దోశలా పోసుకోవాలి. అయితే పలుచగా కాకుండా మందంగా పోయాలి.