సగ్గుబియ్యం వడ

ABN , First Publish Date - 2022-03-16T18:40:57+05:30 IST

సగ్గుబియ్యం- కప్పు, ఆలుగడ్డ- రెండు, పల్లీలు- అర కప్పు, జీలకర్ర- స్పూను, అల్లం పేస్టు

సగ్గుబియ్యం వడ

కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం- కప్పు, ఆలుగడ్డ- రెండు, పల్లీలు- అర కప్పు, జీలకర్ర- స్పూను, అల్లం పేస్టు- అర స్పూను, పచ్చిమిర్చి ముక్కలు - స్పూను, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, ఉప్పు, నూనె - తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా సగ్గుబియ్యాన్ని నీళ్లలో మూడు గంటలు నానబెట్టి, వడకట్టి అరగంటపాటు పక్కన బెట్టాలి. ఆలుగడ్డను ఉడికించి ముద్దగా చేసుకోవాలి. పల్లీలను వేయించి పొడిగా చేయాలి. పెద్ద గిన్నెలో సగ్గుబియ్యం, ఆలు, పల్లీ పొడి, అల్లం పేస్టు, జీలకర్ర, మిర్చి, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలిపి మెత్తని పిండిలా చేయాలి. బాణలిలో నూనె కాచి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా వేయిస్తే సగ్గుబియ్యం వడ తయారు.

Read more