పచ్చ ఆవకాయ

ABN , First Publish Date - 2022-05-28T19:57:40+05:30 IST

పసుపు రంగులో ఉండే పచ్చ మిరపకాయ పొడి - రెండు కప్పులు, ఆవపిండి - రెండు కప్పులు, మామిడికాయ ముక్కలు - మూడు కప్పులు, మెత్తగా దంచిన రాళ్ల ఉప్పు

పచ్చ ఆవకాయ

కావలసినవి: పసుపు రంగులో ఉండే పచ్చ మిరపకాయ పొడి - రెండు కప్పులు, ఆవపిండి - రెండు కప్పులు, మామిడికాయ ముక్కలు - మూడు కప్పులు, మెత్తగా దంచిన రాళ్ల ఉప్పు - ఒక కప్పు, నూనె - అర లీటరు, మెంతులు - ఒక టీస్పూన్‌, ఇంగువ - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో మిరపకాయ పొడి, ఆవపిండి, ఉప్పు, మెంతులు, ఇంగువ వేసి, కొద్దిగా నూనె వేసి కలుపు కోవాలి.తరువాత మామిడికాయ ముక్కలు వేసుకుంటూ మిశ్రమం ముక్కలకు పటే లా బాగా కలియబెట్టుకోవాలి.ఈ పచ్చడిని  జాడీలో పెట్టి భద్రపరుచుకోవాలి.Read more