చులే కా దమ్‌ ముర్గ్‌

ABN , First Publish Date - 2022-04-16T21:12:59+05:30 IST

చికెన్‌ - 700గ్రా, ఉల్లిపాయలు - 300గ్రా, టొమాటో ప్యూరీ - 200గ్రా, జీడిపప్పు పేస్టు - 150గ్రా

చులే కా దమ్‌ ముర్గ్‌

కావలసినవి: చికెన్‌ - 700గ్రా, ఉల్లిపాయలు - 300గ్రా, టొమాటో ప్యూరీ - 200గ్రా, జీడిపప్పు పేస్టు - 150గ్రా, నెయ్యి - 150గ్రా, హోల్‌ గరంమసాలా - 10గ్రా, చికెన్‌ స్టాక్‌ - 300ఎంఎల్‌, ఉప్పు - రుచికి తగినంత, ధనియాల పొడి - 10గ్రా, గరంమసాల పొడి - 5గ్రా, పసుపు - 10గ్రా, కారం - 5గ్రా, కెవ్రా వాటర్‌ - 5ఎంఎల్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - 10గ్రా, కొత్తిమీర - 10గ్రా.


తయారీ విధానం: స్టవ్‌పై కడాయి పెట్టి నెయ్యి వేసి వేడి అయ్యాక హోల్‌ గరంమసాల వేయాలి. కాసేపు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేయాలి. ఇప్పుడు చికెన్‌ వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలను పేస్టులా చేసి వేసుకుని, కాసేపు ఉడికించుకోవాలి.తరువాత టొమాటో ప్యూరీ తగినంత కారం వేసి ఉడికించాలి.బాగా ఉడికిన నూనె తేలిన తరువాత గరంమసాల పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలియబెట్టుకోవాలి. చికెన్‌ స్టాక్‌, కెవ్రా వాటర్‌ వేసి మరికాసేపు ఉడికించుకోవాలి.జీడిపప్పు పేస్టు వేసి గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు ఉంచుకుని దింపుకోవాలి.కొత్తిమీరతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేయాలి.

Read more