జింజర్‌ మింట్‌ లెమనేడ్‌

ABN , First Publish Date - 2022-04-28T16:52:33+05:30 IST

పుదీనా - ఒక కట్ట, అల్లం - ఒక టీస్పూన్‌, నిమ్మరసం - ఒకటేబుల్‌స్పూన్‌, పంచదార - కొద్దిగా, ఐస్‌క్యూబ్స్‌ - నాలుగైదు.

జింజర్‌ మింట్‌ లెమనేడ్‌

కావలసినవి: పుదీనా - ఒక కట్ట, అల్లం - ఒక టీస్పూన్‌, నిమ్మరసం - ఒకటేబుల్‌స్పూన్‌, పంచదార - కొద్దిగా, ఐస్‌క్యూబ్స్‌ - నాలుగైదు. 


తయారీ విధానం: స్టవ్‌పై పాత్ర పెట్టి ఒక కప్పు నీళ్లు పోసి దంచిన అల్లం వేయాలి. చిన్న మంటపై పదినిమిషాల పాటు మరిగించాలి. తరువాత స్టవ్‌పై నుంచి దింపి అరగంట పాటు పక్కన పెట్టాలి. జాలీ సహాయంతో మరో పాత్రలోకి వడబోసుకోవాలి. పుదీనా ఆకులను కొద్దిగా దంచి వేయాలి. నిమ్మరసం, పంచదార వేయాలి. నీళ్లు సరిపడా పోసుకోవాలి. బాగా కలిపి పుదీనా ఆకులను తీసేయాలి. ఐస్‌క్యూబ్స్‌ వేసి చల్లగా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2022-04-28T16:52:33+05:30 IST