డేట్స్‌ ఖీర్‌

ABN , First Publish Date - 2022-01-22T19:21:52+05:30 IST

ఖర్జూర (విత్తనాలు లేనివి) - అర కప్పు, నల్ల ఎండుద్రాక్ష - అరకప్పు, గసగసాలు - పావు కప్పు, బెల్లం - ముప్పావు కప్పు,

డేట్స్‌ ఖీర్‌

కావలసినవి: ఖర్జూర (విత్తనాలు లేనివి) - అర కప్పు, నల్ల ఎండుద్రాక్ష - అరకప్పు, గసగసాలు - పావు కప్పు, బెల్లం - ముప్పావు కప్పు, నెయ్యి - రెండు టీస్పూన్లు, డ్రైఫ్రూట్స్‌ - అరకప్పు, కొబ్బరిపాలు - పావు లీటరు, బియ్యప్పిండి - రెండు టీస్పూన్లు. 


తయారీ విధానం: స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్‌, గసగసాలు, ఖర్జూర, నల్ల ఎండు ద్రాక్షను వేయించుకోవాలి. తరువాత స్టవ్‌ని చిన్నమంటపై పెట్టి అందులో బెల్లం, కొబ్బరిపాలు పోసి కలుపుకోవాలి. ఒక చిన్న బౌల్‌లో బియ్యప్పిండి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి కలియబెట్టుకుని ఆ మిశ్రమాన్ని డ్రై ఫ్రూట్‌ మిశ్రమంలో పోయాలి. పదినిమిషాల పాటు చిన్నమంటపై ఉడికితే డేట్స్‌ ఖీర్‌ రెడీ.  చల్లగా కావాలనుకుంటే ఫ్రిజ్‌లో పెట్టుకుని సర్వ్‌ చేసుకోవచ్చు.

Read more