కోకమ్‌ జ్యూస్‌

ABN , First Publish Date - 2022-05-02T17:21:29+05:30 IST

కోకమ్‌ పండు ముక్కలు - ఒక కప్పు, పంచదార - రెండు కప్పులు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, వేయించిన జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - చిటికెడు.

కోకమ్‌ జ్యూస్‌

కావలసినవి: కోకమ్‌ పండు ముక్కలు - ఒక కప్పు, పంచదార - రెండు కప్పులు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, వేయించిన జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - చిటికెడు.


తయారీ విధానం: ముందుగా కోకమ్‌ పండ్లను శుభ్రంగా కడిగి, విత్తనాలు తీసేయాలి. పండ్లను మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి బ్లెండ్‌ చేసుకోవాలి. తరువాత జ్యూస్‌ను జాలీ సహాయంతో వడబోసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై ఒక పాత్ర పెట్టి కొన్ని నీళ్లు పోసి పంచదార వేసి మరిగించాలి. పంచదార పానకం కొద్దిగా చిక్కగా అయ్యాక దింపుకోవాలి. చల్లారిన తరువాత అందులో వడగట్టుకున్న కోకమ్‌ జ్యూస్‌ను పోయాలి. యాలకుల పొడి, జీలకర్ర పోడి కలుపుకోవాలి. తరువాత ఒక బాటిల్‌లో పోసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.తాగాలనుకున్నప్పుడు ఒక గ్లాసు నీళ్లలో ఒకటి రెండు టేబుల్‌స్పూన్ల కోకమ్‌ జ్యూస్‌ వేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2022-05-02T17:21:29+05:30 IST