సగ్గుబియ్యం బోండాలు

ABN , First Publish Date - 2022-03-05T18:33:22+05:30 IST

సగ్గుబియ్యం - ఒక కప్పు, బటర్‌మిల్క్‌ - ఒక కప్పు, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, బియ్యప్పిండి - పావుకప్పు,

సగ్గుబియ్యం బోండాలు

కావలసినవి: సగ్గుబియ్యం - ఒక కప్పు, బటర్‌మిల్క్‌ - ఒక కప్పు, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, బియ్యప్పిండి - పావుకప్పు, పల్లీలు - రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట, కరివేపాకు - రెండు రెమ్మలు, ఎండుకొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా.


తయారీ విధానం: ఒక బౌల్‌లో సగ్గుబియ్యాన్ని తీసుకుని నీళ్లతో శుభ్రంగా కడగాలి. తరువాత అందులో బటర్‌మిల్క్‌ పోయాలి. తరిగిన పచ్చిమిర్చి, అల్లంముక్క, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. మూత పెట్టి 8 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. పల్లీలను వేయించి పొడి చేసుకోవాలి.  సగ్గుబియ్యం బటర్‌మిల్క్‌ను గ్రహించి మెత్తగా అవుతాయి. ఇప్పుడు బియ్యప్పిండి, పల్లీల పొడి, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి తురుము, జీలకర్ర వేసి కలుపుకోవాలి. అవసరమైతే నీళ్లు కలుపుకోవచ్చు. తరువాత స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోయాలి. అరచేతులకు కాస్త నూనె రాసుకుని మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ బోండాల్లా చేసుకుంటూ నూనెలో వేసి వేయించుకుంటే బోండాలు రెడీ.


Read more