మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా... ఇవ్వరా?: Sharmila

ABN , First Publish Date - 2022-02-05T18:23:48+05:30 IST

తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగించే అంశమని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు.

మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా... ఇవ్వరా?: Sharmila

హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగించే అంశమని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ‘‘నా చావుతోనైన నిరుద్యోగుల ఆత్మహత్యలు అగిపోవాలని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు... మీకు ఇంకెంతమంది నిరుద్యోగులు అర్జీ పెట్టుకోవాలి కేసీఆర్ గారు?. ఇంకెంతమంది కన్నతల్లులు కడుపుకోతను అనుభవించాలి. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా... ఇవ్వరా?. త్వరలో ఉద్యోగాలు అని ఇంకా ఎన్ని ఏండ్లు జరుపుతారు?. మీ నరంలేని నాలుక ఇంకా ఎన్ని అబద్దాలాడుతుంది’’ అని మండిపడ్డారు. నోటిఫికేషన్స్ రాక, ఇంత చదువు చదివి కూలిపని చేస్తున్నావు అనే మాటలు నిరుద్యోగులు భరించలేక పోతున్నారని అన్నారు. అవమానాన్ని భరించలేక తల్లిదండ్రులకు భారం కాలేక పురుగులమందు తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కురుమూర్తి నిన్న ఆత్మహత్య చేసుకోవడం ఏ మనిషినైనా కదిలిస్తుందని... కానీ కేసీఆర్‌ను మాత్రం కదిలించదన్నారు. ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలు నింపడం చేతకాక పోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-02-05T18:23:48+05:30 IST