ప్రతివర్గాన్ని సీఎం కేసీఆర్‌ మోసం చేశారు: షర్మిల

ABN , First Publish Date - 2022-04-25T03:29:28+05:30 IST

ప్రతివర్గాన్ని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని వైఎస్ షర్మిల అన్నారు. భద్రద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను...

ప్రతివర్గాన్ని సీఎం కేసీఆర్‌ మోసం చేశారు: షర్మిల

భద్రాద్రి: ప్రతివర్గాన్ని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని వైఎస్ షర్మిల అన్నారు. భద్రద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ఆమె కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యంగా మారిందని విమర్శించారు. పోలీసులను తమ పని వాళ్లుగా టీఆర్ఎస్‌ నేతలు వాడుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. బంగారు తెలంగాణను బార్ల తెలంగాణగా మార్చారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్‌ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. Read more