సమస్యలపై యువత పోరుబాట

ABN , First Publish Date - 2022-11-22T01:01:11+05:30 IST

మండలకేంద్రంలోని సమస్యల పరిష్కారం కోసం యువకులు ఉద్యమబాట పట్టారు. ఈ నెల 12వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదం ప్రాంతం నుంచి కలెక్టరేట్‌కు సోమవారం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలన్నారు.

సమస్యలపై యువత పోరుబాట

మునగాల నుంచి కలెక్టరేట్‌కు స్థానిక యువకుల పాదయాత్ర

సంఘీభావం తెలిపిన అఖిలపక్షం

మునగాల, నవంబరు 21: మండలకేంద్రంలోని సమస్యల పరిష్కారం కోసం యువకులు ఉద్యమబాట పట్టారు. ఈ నెల 12వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదం ప్రాంతం నుంచి కలెక్టరేట్‌కు సోమవారం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలన్నారు. సర్వీసు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాల ని, ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల వైద్యసదుపాయం కల్పించాలన్నారు. బస్టాండ్‌ ఏర్పాటుతో పాటు రోడ్డు ప్రమాద బాధితుల కోసం ఎమర్జెన్సీ కేంద్రాన్ని నెలకొల్పాలన్నారు. తొలుత ఈ పాదయాత్రను జాతీయజెండా ఊపి జడ్పీటీసీ నల్లపాటి ప్రమీలశ్రీనివాస్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ బుచ్చిపాపయ్య, కొప్పుల జైపాల్‌రెడ్డి, చిల్లంచర్ల ప్రభాకర్‌, జలగం సుధీర్‌, ఎంపీటీసీలు కాసర్ల కల్పనశ్రీను, కాసర్ల కోటేశ్వరరావు, అప్పారావు, సీతారామ్‌, శర్మ, జాన్‌, సూరి, కిరణ్‌ పాల్గొన్నారు.

మూడు గంటలు 23 కిలోమీటర్లు

సూర్యాపేట అర్బన్‌: మునగాలకు చెందిన 20 మంది యువకులు కలెక్టరేట్‌కు పాదయాత్రను ప్రారంభించారు. 23 కిలోమీటర్ల దూరం ఉన్న జిల్లా కేంద్ర సమీపంలోని కలెక్టరేట్‌కు చేరుకొని డిప్యూటీ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తమ సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని కోరారు.

బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలి : ఎంపీ ఉత్తమ్‌

మండలకేంద్రంలో ఈ నెల 12న జరిగిన రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించి న్యాయం చేయాలని ఎంపీ ఉత్త్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఘటనా స్థలాన్ని సోమవారం రాత్రి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన నేషనల్‌ హైవే అథారిటీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే సర్వీస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ఇంత వరకు పేద కుటుంబాలపై స్పందించకపోవటం విచారకరమన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో కొప్పుల జైపాల్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ బుచ్చిపాపయ్య, ఎలక నరేందర్‌రెడ్డి, కాసర్ల కోటేశ్వరావు, రషీద్‌, హరిబాబు, బచ్చు అశోక్‌, ప్రవీణ్‌, సుంకర పిచ్చయ్య, మట్టయ్య, నవీన్‌, జె శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-22T01:01:15+05:30 IST