Kasani Jnaneswar: తెలంగాణలో టీడీపీ ఉందనటానికి నిన్నటి సమావేశమే సాక్ష్యం

ABN , First Publish Date - 2022-11-11T18:21:27+05:30 IST

TS News: పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామని టీడీపీ (TDP) తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. గతంలోలాగే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.

Kasani Jnaneswar: తెలంగాణలో టీడీపీ ఉందనటానికి నిన్నటి సమావేశమే సాక్ష్యం

TS News: పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామని టీడీపీ (TDP) తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. గతంలోలాగే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఆయన శుక్రవారం ఎబీఎన్‌ ప్రతినిధితో మాట్లాడుతూ.. పార్టీలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుని.. అందరిని కలుపుకుని వెళ్తామన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా పోటీకి టీటీడీపీ (TTDP) సిద్ధంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఉన్న సీనియర్ నాయకులంతా తనకు స్నేహితులేనని, పార్టీలో అంతర్గత సమస్యలకు తావులేదన్నారు. ప్రధాని మోదీ (PM Modi) తెలంగాణ పర్యటనను టీటీడీపీ స్వాగతిస్తుందని చెప్పారు. ‘‘మన ఇంటికి వచ్చే అతిథులను స్వాగతించడం మన మర్యాద. టీడీపీ లేదన్న నాయకుల నోర్లతోనే ఉందని చెప్పిస్తా. తెలంగాణలో టీడీపీ ఉందనటానికి నిన్నటి సమావేశమే సాక్ష్యం.’’ అని కాసాని పేర్కొన్నారు.

Updated Date - 2022-11-11T18:21:27+05:30 IST

Read more