మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-09-30T05:34:22+05:30 IST

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లిటౌన్‌, సెప్టెంబరు 29: మహిళా సంక్షేమమే  ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి మునిసిపాలిటీ కార్యాలయం ఆవరణలో చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి సిద్ధు అధ్యక్షతన గురువారం బతుకమ్మ చీరలు, పింఛన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం జరగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేయడమే కాకుండా రంజాన్‌, క్రిస్మస్‌ సందర్భంగా ఆ వర్గాల ప్రజలకు దుస్తులు పంపిణీ చేస్తున్నారని అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని అన్ని కాలనీల్లో మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు ఏర్పాట్లు బాగా చేయాలని మునిసిపల్‌ అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. దసరా ఏర్పాట్లు కూడా అంగరంగ వైభవంగా  జరిగేలా కృషి చేస్తున్నామని అన్నారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటరాణి మాట్లాడుతూ మహిళల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక వినూత్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాల వద్ద పౌష్టికాహారం అందిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, ము నిసిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ అవినాష్‌, ఏఈ రోజారాణి, టీఆర్‌ఎస్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గండ్ర హరీశ్‌రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.


Read more