స్కూటీపై వెళుతున్న మహిళను ఢీకొట్టిన లారీ.. అక్కడికక్కడే మృతి

ABN , First Publish Date - 2022-09-29T16:34:03+05:30 IST

స్కూటీ మీద వెళుతున్న మహిళను లారీ ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మేడ్చల్ టౌన్ ప్రధాన రహదారి

స్కూటీపై వెళుతున్న మహిళను ఢీకొట్టిన లారీ.. అక్కడికక్కడే మృతి

మేడ్చల్ : స్కూటీ మీద వెళుతున్న మహిళను లారీ ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మేడ్చల్ టౌన్ ప్రధాన రహదారి వివేకానంద విగ్రహం (Vivekananda Statue) సెంటర్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్‌లో నివాసముంటున్న ప్రియా మోర్ (30) ఉదయాన్నే విధులకు స్కూటీపై బయలు దేరింది. డివైడర్ వద్ద రోడ్డు దాటుతుండగా.. అతివేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో ప్రియా లారీ ముందు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రాథమిక దర్యాప్తులో మృతురాలు ప్రియా మోర్, రిలయన్స్, కండ్లకోయ శాఖలో పని చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి. మేడ్చల్ పోలీసులు (Medchal Police) కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  


Read more