క్రీడల్లో గెలుపు ఓటములు సహజం : ఎమ్మెల్యే కంచర్ల

ABN , First Publish Date - 2022-12-31T00:59:40+05:30 IST

క్రీడల్లో గెలుపు, ఓటము లు సహజమని, ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురికాకుండా గెలుపొందేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ రోడ్డులోని విపస్య పాఠశాల మైదానంలో ట్ర స్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్‌ స్కూల్‌ స్పోర్ట్స్‌ మీట్స్‌ ము గింపు సందర్భంగా శుక్రవారం విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు.

 క్రీడల్లో గెలుపు ఓటములు సహజం : ఎమ్మెల్యే కంచర్ల

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం : ఎమ్మెల్యే కంచర్ల

ముగిసిన ఇంటర్‌ స్కూల్‌ స్పోర్ట్స్‌ మీట్‌

నల్లగొండ స్పోర్ట్స్‌, డిసెంబరు 30: క్రీడల్లో గెలుపు, ఓటము లు సహజమని, ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురికాకుండా గెలుపొందేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ రోడ్డులోని విపస్య పాఠశాల మైదానంలో ట్ర స్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్‌ స్కూల్‌ స్పోర్ట్స్‌ మీట్స్‌ ము గింపు సందర్భంగా శుక్రవారం విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. క్రీడలు విద్యార్థుల మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన క్రీడా బాల, బాలికలు వారి ప్రతిభను చాటుకున్నారని పేర్కొన్నారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో నిర్వహించి న పోటీల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ టీంలకు షీల్డ్‌, మెమోంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి, కౌన్సిలర్‌ బొజ్జ శంకర్‌, బుర్రి యా దయ్య, రావుల శ్రీనివా్‌సరెడ్డి, ఇంటర్‌ స్కూల్‌ స్పోర్ట్స్‌మీట్‌ ఆర్గనైజింగ్‌ కన్వీనర్‌ కొలనుపాక రవికుమార్‌, రాష్ట్ర నాయకులు బండారు ప్రసా ద్‌, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు రాంమోహన, డివిజన అధ్యక్షుడు శ్యాం సుందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాగేందర్‌, జానరెడ్డి, గణేష్‌, దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

సుశ్రుత గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి

నల్లగొండ అర్బన: గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో ప్రజల కు వైద్య సేవలందిస్తున్న సుశ్రుత గ్రామీణ వైద్యుల (ఆర్‌ఎంపీ, పీ ఎంపీ) సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ వైద్యుల సేవలు వెలకట్టలేనివని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజలకు ధైర్యంగా వైద్య సేవలందించిన వారి సేవలు మరువలేనివని అన్నారు. డీఎంహెచవో డాక్టర్‌ కొండల్‌రావు మాట్లాడుతూ ప్రజలకు వైద్యచికిత్సలు అందించడంతో పాటు సంక్షేమ పథకాల్లో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు భాగస్వామ్యులై ప్రజలకు సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొనుగోటి హ న్మంతరావు, జిల్లా అధ్యక్షుడు దాసోజు సత్యనారాయణ, నాయకులు చొల్లేటి బ్రహ్మచారి, వనం యాదగిరి, గునగంటి రాజశేఖర్‌, కృష్ణారె డ్డి, కర్నాటి శ్రీనివాస్‌, నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-31T00:59:41+05:30 IST