పొట్టకూటికని వచ్చి మా పొట్టలు కొడతారా ?

ABN , First Publish Date - 2022-10-03T09:48:22+05:30 IST

తక్కువ కూలికే పనులకు వెళుతున్న పొరుగు రాష్ట్రాల వారి వల్ల ఉపాధి కోల్పోతున్న స్థానిక కూలీల ఆవేదన వివాదానికి దారి తీసింది.

పొట్టకూటికని వచ్చి మా పొట్టలు కొడతారా ?

నల్గగొండలో బిహార్‌ కూలీలతో స్థానిక కూలీల ఘర్షణ

నల్లగొండ టౌన్‌, అక్టోబరు 2: తక్కువ కూలికే పనులకు వెళుతున్న పొరుగు రాష్ట్రాల వారి వల్ల ఉపాధి కోల్పోతున్న స్థానిక కూలీల ఆవేదన వివాదానికి దారి తీసింది. మాటామాటా పెరిగి బిహార్‌కు చెందిన కూలీలు, తెలంగాణకు చెందిన కూలీలు పరస్పరం రాళ్లు రువ్వుకునే స్థాయికి పరిస్థితి చేరింది. నల్లగొండ పట్టణ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన కూలీలు రోజు పొద్దునే పని కోసం డీఈవో కార్యాలయం ఎదుట ఉన్న భాస్కర్‌ టాకీస్‌ అడ్డాకు వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నల్లగొండలో స్థిరపడిన కూలీలు కూడా పని కోసం అక్కడికే వస్తుంటారు. స్థానిక కూలీలకు రోజుకు రూ.600 నుంచి రూ.700 వరకు కూలీ లభిస్తుంది. అయితే, బిహార్‌కు చెందిన కూలీలు రూ.300 నుంచి రూ.400కే అదే పనులకు వెళ్తున్నారు. దీంతో స్థానిక కూలీలను పనికి పిలిచే వారు కరువయ్యారు. ఈ క్రమంలో స్థానిక కూలీలు బిహార్‌ కూలీలతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి ఇరువర్గాల వాళ్లు పరస్పరం రాళ్ల దాడికి దిగారు.


Read more