11న గోదావరి బోర్డు భేటీ జరిగేనా?

ABN , First Publish Date - 2022-03-05T06:47:29+05:30 IST

గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) ఈనెల 11న

11న గోదావరి బోర్డు భేటీ జరిగేనా?

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) ఈనెల 11న నిర్వహించ తలపెట్టిన సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. సమావేశం వాయిదా వేయాలని ఏపీ కోరగా, ఆరునూరైనా భేటీ జరగాల్సిందేనని తెలంగాణ పట్టుబడుతోంది. తెలంగాణలోని పలు ప్రాజెక్టుల డీపీఆర్‌లు కీలక దశ దాటాయి. ఈ నేపథ్యంలో బోర్డు సమావేశంలో వీటిని పరిశీలించిన తర్వాత సాంకేతిక పరిశీలన కమిటీ(టీఏసీ), అపెక్స్‌ కౌన్సిల్‌కు చేర్చాలని చూస్తున్న తెలంగాణ సమావేశం జరగాలని కోరుతోంది. ఏపీ మాత్రం శాసనసభ సమావేశాలు ఉన్నందున వాయిదా వేయాలని కోరుతోంది. దీంతో  11న సమావేశం నిర్వహిస్తారా...? వాయిదా వేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. 


Updated Date - 2022-03-05T06:47:29+05:30 IST