జగన్‌, కేసీఆర్‌ ఎందుకు కలవరు?: నారాయణ

ABN , First Publish Date - 2022-03-05T06:46:50+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌

జగన్‌, కేసీఆర్‌ ఎందుకు కలవరు?: నారాయణ

దేవరకొండ, మార్చి 4: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లు బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం ఎందుకు కలిసి వెళ్లడంలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో శుక్రవారం జరిగిన మాజీ ఎమ్మెల్యే పల్లా పర్వతరెడ్డి వర్ధంతి సభకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించే పార్టీలతో కలిసి నడవడానికి తాము సిద్ధమని చెప్పారు.  బీజేపీ మత రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు. 


Read more