తాగితే తప్పేంటి?

ABN , First Publish Date - 2022-10-11T09:40:42+05:30 IST

‘బంధువులతో కలిసి మద్యం తాగితే తప్పేంటి? దీనిపై ఇంత రాద్ధాంతమెందుకు?’ అని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు.

తాగితే తప్పేంటి?

  • బంధువులతో కలిసి మద్యం తీసుకున్నా..
  • సీబీఐతో విచారణ జరిపించుకోండి
  • రాద్ధాంతం వెనుక బీజేపీ కుట్ర: మల్లారెడ్డి

బోయినపల్లి, అక్టోబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): ‘బంధువులతో కలిసి మద్యం తాగితే తప్పేంటి? దీనిపై ఇంత రాద్ధాంతమెందుకు?’ అని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లిన ఆయన ఆదివారం.. ఓ ఇంట్లో కొందరికి మద్యం పోస్తున్న చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీనిపై బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో సోమవారం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడిన ఆయన.. ఆ విమర్శలపై తనదైన శైలిలో స్పందించారు. తానేదో చేయరాని పని చేసినట్లు బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇందులో బీజేపీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొనడంపై స్పందిస్తూ.. అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించుకోవాలని సవాల్‌ విసిరారు. సీబీఐ వాళ్లకు పెద్దగా పనీపాటా ఏమీ లేదని, ఖాళీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. తాను మద్యం తీసుకోవడాన్ని పెద్ద నేరం అన్నట్లుగా చిత్రీకరించడం.. బీజేపీ ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు.

Read more