అంతర్‌ రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ అరెస్టు

ABN , First Publish Date - 2022-01-04T04:56:43+05:30 IST

అంతర్‌ రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ అరెస్టు

అంతర్‌ రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ అరెస్టు
నిందితుడి అరెస్టు చూపుతున్న సీపీ

  30 కిలోల గంజాయి స్వాధీనం

  పరారీలో మరో ఇద్దరు నిందితులు

  సిబ్బందిని అభినందించిన సీపీ తరుణ్‌జోషి

హనుమకొండ క్రైం, జనవరి 3: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో అంతర్‌ రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లర్‌ నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషి తెలిపారు. హనుమకొండలోని పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి అరెస్టు చూపి స్తూ వివరాలు వెల్లడించారు. ఒడిషా రాష్ట్రం గంజం జిల్లా కొ దల గ్రామానికి చెందిన బిష్ణు ప్రసాద్‌దాస్‌, సుదాన్షు సాహు, జితేందర్‌ జెన్నలు స్నేహితులు. వీరు సులభంగా డబ్బులు సంపాదించాలని గంజాయి వ్యాపారం చేపట్టారు. ఇందులో ఒక్కరైన సుదాన్షు సాహు వరంగల్‌ నగరంలో ఉన్న జితేందర్‌ జెన్నకు 30కిలోల గంజాయిని అప్పగించి అతనితో సూరత్‌కు వెళ్లి అక్కడ గంజాయిని అప్పగించాల్సిందిగా బిష్ణు ప్రసాద్‌దాసుకు చెప్పాడు. దీంతో ఈ నెల 1వ తేదీన బిష్ణు ప్రసాద్‌దాస్‌ రెండు కిలోల చొప్పున 15 గంజాయు ప్యాకెట్‌లను బ్యాగుల్లో వేసుకుని రైలులో ఒడిషా నుంచి వరంగల్‌కు తీసుకొచ్చాడు. వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో దిగి జితేందర్‌ జెన్న కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతేజార్‌గంజ్‌ పోలీసులకు స మాచారం అందడంతో బిష్ణు ప్రసాద్‌దాసును అదుపులోకి తీ సుకున్నారు. తనిఖీ చేయగా గంజాయితో పాటు సెల్‌ఫోన్‌ ల భించింది. పోలీసులను చూసి జితేందర్‌ జెన్న పారిపోయిన ట్లు సీపీ తెలిపారు. నిందితుడు గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసుల ఎదుట అంగీకరించగా అతడి వద్ద ఉ న్న గంజాయి బ్యాగులను స్వాధీనం చేసుకుని పోలీ్‌సస్టేషన్‌ కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు స్మగ్లర్లు సుదా న్షు సాహు, జితేందర్‌ జెన్నల కోసం పోలీసులు గాలిస్తున్నా రు. ప్రతిభ కనబర్చిన వరంగల్‌ ఏసీపీ గిరికుమార్‌, ఇంతేజార్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లేష్‌, ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ టీఎస్‌ఆర్‌ కృష్ణ, ఇంతేజార్‌గంజ్‌ ఎస్సై నాగరాజు, ఏఏవో సాల్మాన్‌పాషా, కానిస్టేబుళ్లు సర్ధార్‌, రాజు, రవిలను సీపీ అభినందించారు.

 

Updated Date - 2022-01-04T04:56:43+05:30 IST