దక్షిణాది రాష్ట్రాలతో నేడు జల్‌శక్తి మంత్రి భేటీ

ABN , First Publish Date - 2022-03-05T06:48:01+05:30 IST

గ్రామీణ స్వచ్ఛ భారత్‌ మిషన్‌, జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమాల

దక్షిణాది రాష్ట్రాలతో నేడు జల్‌శక్తి మంత్రి భేటీ

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ స్వచ్ఛ భారత్‌ మిషన్‌, జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమాల నిర్వహణ, పురోగతి వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ దక్షిణాది రాష్ట్రాలతో శనివారం సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణతో పాటు పుదుచ్చెరికి చెందిన మంత్రులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. బెంగుళూరులో ఈ భేటీ జరగనుంది. పలు అంశాలపై ఈ సమావేశంలో ఆయన సమీక్షిస్తారు. 


Read more