ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు.. ఓరుగల్లు

ABN , First Publish Date - 2022-04-26T05:56:28+05:30 IST

ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు.. ఓరుగల్లు

ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు.. ఓరుగల్లు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే నరేందర్‌

హంపీ పీఠాధిపతి గోవిందానందసరస్వతి

వరంగల్‌లో 28 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహావిష్కరణ వేడుకలు


శంభునిపేట, ఏప్రిల్‌ 25 : ఆధ్యాత్మి కతకు పుట్టినిల్లు ఓరుగల్లు అని హంపీ పీఠాధిపతి గోవిందానంద సరస్వతి స్వామీ  అన్నారు. రాష్ట్రంలోనే ఎత్తైన 28 అడు గుల సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాన్ని వరంగల్‌ నగరంలోని ఉర్సు సుభాష్‌ నగర్‌లోని నాగేశ్వరస్వామి ఆలయంలో సోమ వారం స్వామీజీ చేతుల మీదుగా ఆవిష్కరిం చారు. అర్చకులు జాగర్లపూడి శ్రీరామ శర్మ, హరీష్‌ శర్మ, ఋత్వికుల వేదమంత్రో చ్చరణలతో గణపతి యంత్ర ప్రతిష్ఠాపన చేసి శ్రీవల్లిదేవసేన సమేత సుబ్రహ్మ ణ్యేశ్వర నాగేంద్రస్వామికి సంప్రోక్షణ, కుంభాభిషేకములు నిర్వహించారు. మూ డు రోజులు హోమాలు, క్రతువులు నిర్వ హించి, గోపురాలకు కలశాలకు అమర్చారు. లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనం తరం ఆలయ ప్రదాన ద్వారం ముందు ప్రత్యేక పూజలు చేసి సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించగానే భ క్తుల జయజయఽధ్వానాలతో ఆలయ ప్రాంగణం మారుమో గింది. అనంతరం గోవిందానంద సరస్వతి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ భార తదేశ సంస్కృతి, నాగరికత నేటికీ వర్ధిల్లడానికి ప్రజల్లో పేరుకుపోయిన ఆధ్యాత్మిక భావనలే కారమన్నారు. సనాతన ధర్మం ఇక్కడి సమాజంలో పాతుకుపోయిందన్నారు. ఓరుగల్లులో వెలసిన పద్మాక్షి, రుద్రేశ్వర, భద్రకాళి, సిద్ధేశ్వర, మల్లికార్జున ఆలయాలు శక్తి స్వరూపాలుగా విరాజిల్లుతున్నాయని పేర్కొన్నారు. ఽధర్మాన్ని ఆచరించడంలో ముందుంటారని తెలిపారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ కలశాలను ఎత్తుకొని ప్రదక్షిణలు చేసి మాట్లాడుతూ విగ్రహావిష్కణలో పాల్గొన డం అదృష్టమన్నారు. 

మేయర్‌ గుండు సుధారాణి మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతి పెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని నగరంలో ప్రతిష్ఠించటం ఆనందంగా ఉందన్నారు. ఉత్సవాల నిర్వహ ణకు కార్పొరేషన్‌ ద్వారా సౌకర్యాలు కల్పించామన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన శిల్పి దున్న శ్రీనివాస్‌ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం తోపాటు సాకారాన్ని రమణీయంగా తీర్చిదిద్దారు. ఈవో కమలాదేవి పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమం లో చైర్మన్‌ తోట నర్సయ్యలింగం, ధర్మకర్తలు వాడిక విద్యా సాగర్‌, బజ్జూరి రవి, గుడిమల్ల రాజు, గుండాల కవిత, పల్లె మల్లేశం, కార్పొరేటర్‌లు పోశాల పద్మస్వామి, మరుపల్ల రవి, గుండు చందనపూర్ణచందర్‌, బైరబోయిన ఉమా దామోదర్‌ యాదవ్‌, సిద్దం రాజు, ముష్కమల్ల అరుణ సుధాకర్‌, కావేటి కవిత, ఆకుతోట రామతేజస్వీ శిరీష్‌, కేడల పద్మజనార్దన్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2022-04-26T05:56:28+05:30 IST