Corona cases: వరంగల్ ఎంజీఎంకు కరోనా పేషెంట్ల తాకిడి

ABN , First Publish Date - 2022-07-28T15:17:32+05:30 IST

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

Corona cases: వరంగల్ ఎంజీఎంకు కరోనా పేషెంట్ల తాకిడి

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా(Corona) కలకలం రేపుతోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వరంగల్ ఎంజీఎం(MGM)కు కరోనా పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉంది. దీంతో ఎంజీఎం అధికారులు కరోనా పేషెంట్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న తొర్రూర్ కస్తూర్బాగాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొన్న ఖానాపురం మండలం యాపచెట్టుపంచాయతీ పరిధిలోని కోమటిపల్లి తండాకు చెందిన ఇస్లావత్ మురళీ అనే యువకుడు కరోనాతో మృతి చెందాడు. పెరుగుతున్న కేసులతో జనం భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2022-07-28T15:17:32+05:30 IST