Warangal వ్యాప్తంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-06-27T17:15:56+05:30 IST
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్(Congress) ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఈ దీక్షలు చేపట్టింది. వరంగల్‌లో కొండా సురేఖ, సిరిసిల్ల రాజయ్య, ఇతర నాయకులు పాల్గొనగా, హనుమకొండ డీసీసీ భవన్లో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. అలాగే ములుగులో ఎమ్మెల్యే సీతక్క దీక్ష చేపట్టారు. మహబూబాబాద్‌లో భరత్ చంద్ రెడ్డి, కురవిలో రాంచంద్రునాయక్, జనగామలో జంగా రాఘవరెడ్డి, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు.