హరితహారాన్ని విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-04-24T06:15:41+05:30 IST

హరితహారాన్ని విజయవంతం చేయాలి

హరితహారాన్ని విజయవంతం చేయాలి
మొక్కకు నీళ్లు పోస్తున్న కలెక్టర్‌ గోపి

కలెక్టర్‌ బి.గోపి 


ఖానాపురం, ఏప్రిల్‌ 23: హరితహారం కార్యక్రమా న్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ గోపి అన్నారు. పాకాలలో హరితహారం కార్యక్రమానికి సంబంధించి జిల్లాస్థా యి నమన్వయ సమావేశం, అటవీ సంరక్షణ అంశా లపై శనివారం ఏర్పాటు చేసిన సమావేశాల్లో కలెక్టర్‌ గోపి మాట్లాడారు. హరితహారం కోసం నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు. హరితహారంలో భాగంగా జిల్లాలో 26లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. నర్సరీల్లో మొక్కల పెంప కంపై ఫారెస్ట్‌ అధికారులు సలహాలు ఇచ్చి మొక్కల పెరుగుదలకు సహకరించాలన్నారు. మునిసిపాలిటీల్లో, డివైడర్ల మధ్య అందమైన పూల మొక్కలు నాటాలని, రోడ్లకు ఇరువైపులా నీడనిచ్చే మొక్కలు నాటి సంరక్షించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పల్లెప్రకృతి వనాల్లో వీ లైతే పండ్ల మొక్కలు పెంచాలని సూచించారు. స్థలం అందుబాటులో ఉన్నచోట మంకీ ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేసి పండ్ల మొక్కలు నాటాలన్నారు. 

ఎండాకాలంలో మొక్కలను కాపాడేందుకు జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు. అందరి సమష్టి సహకారంతో పచ్చదనం పెంపునకు మొక్కలు నాటాలన్నారు. అలా గే అడవుల సంరక్షణ అందరి బాధ్యతగా గుర్తించాలని చెప్పారు. నర్సంపేటలో కొన్ని ప్రాంతాల్లోని పోడు భూముల్లో గంజాయి సాగవుతున్నట్లు సమాచారం ఉందని, గంజాయి సాగును అరికట్టేందుకు ఎక్సైజ్‌ శాఖ అధికారులు.. ఫారెస్ట్‌ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. టూరిజం, ఫారెస్ట్‌ శాఖ ల అధికారులతో మాట్లాడి పాకాలలో బోటింగ్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. తొలుత కలెక్టర్‌ ఫారెస్ట్‌ గెస్ట్‌హౌ్‌సను ప్రారంభించిన అనంతరం పాకాల బయోడైవర్సిటీ పార్క్‌లోని సీతాకోకచిలుకల వనంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌, డీఎ్‌ఫవో అర్పణ. డీఆర్‌డీ వో సంపత్‌రావు,  డీపీవో స్వరూప, డీఈవో వాసంతి, జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్‌, డీసీవో సంజీవరెడ్డి, ఆర్డీవో పవన్‌కుమార్‌, ఎఫ్‌ఆర్వో రమేష్‌, డీఆర్వో మోహన్‌ పాల్గొన్నారు.

Read more