వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు : వివేక్

ABN , First Publish Date - 2022-02-16T20:08:18+05:30 IST

ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ ప్రజలను మర్చిపోయారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు : వివేక్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ ప్రజలను మర్చిపోయారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ శవయాత్రలకు కేసీఆర్ ఫ్రస్టేషనే కారణమన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ, మోటార్లకు మీటర్లపై కేసీఆర్ అవాస్తవాలను ఖండిస్తున్నానన్నారు. ఇంకా వివేక్ మాట్లాడుతూ.. ‘‘నిజాం ఘగర్ ప్యాక్టరీని రీఓపెన్ చేస్తానని కేసీఆర్ మాట తప్పాడు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్లకు సీఎం కేసీఆర్ ఊడిగం చేస్తున్నాడు. కేసీఆర్ తీరుతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీతో రాష్ట్రం అప్పుల పాలైంది. అవినీతి, కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసిగిపోయారు’’ అని పేర్కొన్నారు.


Read more