మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి: Revanth Reddy

ABN , First Publish Date - 2022-06-11T20:06:56+05:30 IST

సోమవారం అన్ని రాష్ట్రాల ఈడీ ఆఫీసుల ఎదుట కాంగ్రెస్ నిరసన తెలుపుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు.

మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి: Revanth Reddy

హైదరాబాద్: సోమవారం అన్ని రాష్ట్రాల ఈడీ ఆఫీసుల ఎదుట కాంగ్రెస్ నిరసన తెలుపుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తమ అనుబంధ విభాగాలుగా సీబీఐ, ఈడీలను మార్చుకున్నాయని విమర్శించారు. గ్రేటర్ పరధిలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై అఘాయిత్యాలపై ఈనెల 15 అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్, బీజేపీలను ఆహ్వానిస్తామని తెలిపారు. రైతు రచ్చబండ కార్యక్రమం కార్యక్రమంలో మరింత స్పీడ్ పెంచాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2022-06-11T20:06:56+05:30 IST