ABNతో అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న బాధితుల వీడియో కాల్
ABN , First Publish Date - 2022-07-09T18:43:07+05:30 IST
అమర్నాథ్ యాత్ర (Amarnath yatra)లో చిక్కుకున్న బాధితులు ఏబీఎన్‌తో వీడియో కాల్లో మాట్లాడారు.

జగిత్యాల: అమర్నాథ్ యాత్ర (Amarnath yatra)లో చిక్కుకున్న బాధితులు ఏబీఎన్(ABN)తో వీడియో కాల్లో మాట్లాడారు. ఈ క్రమంలో కొండల్లో భయానక పరిస్థితులు వీడియోలో కనిపించాయి. గుర్రాలపైన సురక్షిత ప్రాంతాలకు బాధితులు చేరుకుంటున్నారు. జగిత్యాల నుంచి ఆరుగురు అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. తామంతా క్షేమంగా ఉన్నామని కుటుంబానికి సమాచారం అందించారు. ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja singh) వెళ్లిన ప్లైట్లోనే వెళ్లామని ఏబీఎన్‌తో యాత్రికులు చెప్పారు. కొండచరియలు, గుర్రాలపై వెళ్తున్న దృశ్యాలను యాత్రికులు వీడియోలో ఏబీఎన్‌కు చూపించారు.